PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సంపాదించాలి : ఎమ్మెల్యే

1 min read

– మొదటి స్థానాన్ని సాధించడానికి ముఖ్య నాయకులతో సమీక్షా నిర్వహించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
– ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో “జగనన్నే మా భవిష్యత్తు సమీక్షా సమావేశంనునిర్వహించారు. ఈ కార్యక్రమానికి బనగానపల్లె నియోజకవర్గం బనగానపల్లె అవుకు కోవెలకుంట్ల కొలిమిగుండ్ల సంజామల మండలం వైయస్సార్ పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులుకాటసానిరామిరెడ్డిమాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు బనగానపల్లె నియోజకవర్గం లో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే బనగానపల్లె నియోజకవర్గం మూడవ స్థానాన్ని సంపాదించడం జరిగిందని ఇందుకు కృషి చేసిన మండల సచివాలయ కన్వీనర్లు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషితోనే ఈరోజు రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని సంపాదించడం జరిగిందని చెప్పారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 29వ తేదీ వరకు జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం పెంచడం జరిగిందని కాబట్టి ఇంకా నియోజకవర్గంలోని వైయస్సార్ పార్టీ అభిమానులు కార్యకర్తలు గృహసారథులు వాలంటీర్లు సచివాలయ కన్వీనర్ లో అందరూ సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఇంటికి వెళ్లి 82960 82960 అనే నెంబర్ కు మిస్డ్ కాల్ అందించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సంపాదించాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పీపుల్స్ మెగా సర్వేలో కోటి మందికి పైగా ఈ సర్వేలో పాల్గొనడం జరిగిందని దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంతమంది సర్వేలో పాల్గొనడం జరగలేదని అది కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైయస్సార్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. 2024 సంవత్సరంలో ప్రతి కార్యకర్త ఒక సైనికులు వలె పోరాటం చేసి మళ్లీ మన జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశంపార్టీదుష్టచతుష్టాయనికివ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కాబట్టి రాజకీయాలకు ,పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వారు ఎంత లబ్ధి చెందారో వారికి సవివరంగా తెలియజేయాలని వారికి మన పార్టీ పట్ల సానుకూలంగా ఉండేటట్లు కార్యక్రమాలు చేపట్టాలని అప్పుడే మనం మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకోగలుగుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నాయకులు అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరు పాల్ రెడ్డి.ఓబుల్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు చల్లా విఘ్నేశ్వర రెడ్డి, అవుకు మండలం జడ్పిటిసి సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి, కోయిలకుంట్ల పట్టణ ఉపసర్పంచ్ జి సి ఆర్ సూర్యనారాయణ రెడ్డి, కోయిలకుంట్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బివి నాగార్జున రెడ్డి, వైయస్సార్ పార్టీ మైనారిటీ నాయకులు అత్తర్ జాహీద్ హుస్సేన్, కోయిలకుంట్ల మండలం వైయస్సార్ పార్టీ కన్వీనర్ భీమిరెడ్డి నాగ ప్రతాపరెడ్డి, జిల్లాల శంకర్ రెడ్డి, బనగానపల్లె మండల సచివాలయ కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి, అవుకు మండలం సచివాలయ కన్వీనర్ తల్లం సుబ్రహ్మణ్యం, కోయిలకుంట్ల మండల సచివాలయ కన్వీనర్ లాయర్ మధుసూదన్ రెడ్డి, మండల మండల సచివాలయ కన్వీనర్ దారెడ్డి సుధాకర్ రెడ్డి, కొలిమిగుండ్ల మండల సచివాలయ కన్వీనర్ మొలక రాజారెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ వైయస్సార్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author