NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీర‌వ్ మోదీ భార‌త్ కు రాక త‌ప్పదా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు కుంభ‌కోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ భార‌త్ కు రాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయ‌త్నిస్తున్నారు. కానీ ఆయ‌న ప్రయ‌త్నాల‌న్నీ బెడిసికొడుతున్నాయి. త‌న‌ను భార‌త్ కు అప్పగించాల‌న్న యూకే కోర్టు తీర్పు పై అప్పీల్ చేసుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ నీర‌వ్ మోదీ చేసిన రాత పూర్వక అభ్యర్థన‌ను లండ‌న్ కోర్టు తిర‌స్కరించింది. అయితే.. భార‌త్ కు అప్పగింత పై అప్పీల్ చేసుకునేందుకు నీర‌వ్ మోదీకి మ‌రొక అవ‌కాశం ఉంది. న్యాయ‌ప‌ర‌మైన నిబంధ‌న‌ల ప్రకారం మ‌రో ఐదు రోజుల్లో అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఆ అప్పీల్ ను కోర్టు స్వీక‌రిస్తే… విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది. లేదంటే నీర‌వ్ మోదీ భార‌త్ కు రాక త‌ప్పద‌ని న్యాయ‌నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

About Author