సాయంత్రం 5 తరువాత… విధుల్లో ఉండరాదు
1 min readఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్:ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం కొనసాగుతోందన్నారు ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లాచ చైర్మన్ గిరికుమార్ రెడ్డి. ఉద్యోగులను రోడ్డుపై నిలబెట్టిన వారికి బుద్ధి చెప్పేందుకు ప్రతి ఉద్యోగి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ‘వర్క్ టు రూల్లో భాగంగా గురువారం కర్నూలు కలెక్టరేట్లోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులను సాయంత్రం 5 గంటల తరువాత బయటకు పంపారు. ఈ సందర్భంగా గిరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 5వ తేదీ వరకు వర్క్ టు రూల్ కొనసాగుతోందని, ఇందుకు ప్రతి ఉద్యోగి సహకరించాలని కోరారు. సాయంత్రం 5 గంటల తర్వాత అధికారులు ఎవరైనా పని చెయ్యాలని ఒత్తిడి చేస్తే తమ దృష్టికి తీసుకునిరావాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు 5 తర్వాత ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది.