చిరంజీవి లాంటి వారు అంతలా ప్రాధేయపడాలా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్‌ని ప్రాధేయపడాలా? అని ప్రశ్నించారు. తెలుగు సినిమా పరిశ్రమని జగన్‌రెడ్డి కించపరిచారని దుయ్యబట్టారు. లేని సమస్యను సృష్టించి జగన్‌రెడ్డి సినీ హీరోలను అవమానించారని తప్పుబట్టారు. సీఎం జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాజీనామాలపై నాటి మీ సవాళ్లు ఏమయ్యాయని నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎజెండాలో ప్రత్యేక హోదా తమ ఘనతే అని చెప్పుకుని.. ఇప్పుడు తమపై బురద జల్లుతారా? అని ప్రశ్నించారు.