హెచ్ఆర్ఏ స్లాబుల జీఓను ఉపసంహరించాల్సిందే..: వైఎస్సార్ టీఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: పిఆర్సీలో గత హెచ్ఆర్ఏ స్లాబులను తగ్గిస్తూ జీవోలు జారీ చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ కి తీవ్ర నష్టం కలిగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి జె ఏ స్టీవెన్ కె వెంకట్రావు, కోశాధికారి వడ్లమూడి రామ్మోహనరావు, రాష్ట్రనాయకులు జి.జే. ప్రభు వరం, మురాల సుధాకర్, బొడ్డేటి రాధాకృష్ణ, అన్నాజీరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపార. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గించడం వలన ఉద్యోగ,ఉపాధ్యాయులు నష్టపోయారని, HRA కి సంబంధించి ఇప్పటికే ఇస్తున్న రేట్లను తగ్గిస్తూ ఇవ్వడం వల్ల పి ఆర్ సి లో జీతాలు పెరగకపోగా తగ్గిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అలాగే పెన్షనర్స్ యొక్కక్యాటమ్ పెన్షన్ రేట్లను గతంలో లాగే ఇవ్వాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను ఉపసంహరించుకొని పాత స్లాబులతో ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వస్తే పిఆర్సీ, డిఎ,సిపియస్ విషయంలో ఉద్యోగ,ఉపాధ్యాయులకు అన్నీ సకాలంలో ఇచ్చి న్యాయం చేస్తామని మాటిచ్చారని .. మాట ప్రకారం న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. పిర్సీలోఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం జరిగే హెచ్ఆర్ఎ ఉత్తర్వులను ఉపసంహరించకపోతేప్రత్యక్ష కార్యాచరణకు ఉద్యోగస్తులు అంతా సిద్ధమని ఒక ప్రకటనలో తెలియజేశారు.