PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యా సంస్థ‌ల్లోను మ‌త హ‌క్కు ఉండాలా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు ఉన్నప్పటికీ, దాన్ని విద్యాసంస్థల్లోనూ పాటించాల్సి ఉంటుందా అని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. విద్యార్థినులు హిజాబ్‌ను ధరించి తరగతులకు హాజరు కాకూడదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను పరిశీలించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. తొలుత సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ వాదనలు వినిపిస్తూ ఇందులో రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉన్నందున కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని కోరారు. హిజాబ్‌ ధారణ ‘తప్పనిసరి మత ఆచారం’ కిందికి వస్తుందో రాదో పరిశీలించాలని కోరారు. దీనిపై జస్టిస్‌ హేమంత్‌ గుప్తా స్పందిస్తూ ఇది ‘తప్పనిసరి మత ఆచారం’ కిందికి రాదని, కానీ ప్రభుత్వం డ్రెస్‌ కోడ్‌ను నియంత్రించవచ్చా అన్నదే ప్రశ్న అని తెలిపారు. ఇంత విస్తృతమైన ప్రశ్నల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని పిటిషనర్ల తరఫున మరో సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే కోర్టుకు తెలిపారు. కర్ణాటక విద్యా చట్టం ప్రకారం డ్రెస్‌ కోడ్‌ను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అన్నదే ఆలోచించాలని అన్నారు. కర్ణాటక విద్యా చట్టంలోని సెక్షన్‌ 39 ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు ఏ విద్యా సంస్థగానీ మతం, కులం, జాతి, భాష ఆధారంగా ప్రవేశాలను నిరాకరించకూడదని గుర్తుచేశారు.

                                             

About Author