NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శౌర్య @ 22

1 min read

సినిమా డెస్క్​: హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నాగశౌర్య జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. వరుసగా ఆరు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రజెంట్‌ తన ఇరవై రెండో మూవీ నిన్న హైదరాబాద్‌లో మొదలైంది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తన హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈయేడు ప్రారంభంలోనే స్టార్ట్ చేశారు. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ని నిన్న మొదలుపెట్టారు. నాగశౌర్యకి జోడీగా షర్లీ సేతియా నటిస్తోంది. సీనియర్ నటి రాధిక, సత్య, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం వీరిపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను అతి త్వరలోనే రివీల్ చేస్తామన్నారు దర్శకనిర్మాతలు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ, మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక శౌర్య వరుడు కావలెను, లక్ష్య, ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి, పోలీసు వారి హెచ్చరిక సినిమాలతో పాటు శ్రీమాన్ అనే దర్శకుడితోనూ కమిట్‌మెంట్స్ ఉన్నాయి.

About Author