బీజేపీ వైపు ఆమె చూపు ?
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి స్వతంత్ర ఎంపీగా కొనసాగుతున్న సుమలతా అంబరీష్ బీజేపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతకాలంగా ఆమె పార్టీలో చేరే అంశం ప్రస్తావనకు వస్తూనే ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతను జిల్లా ప్రజలు సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, అప్పటి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్కుమార్పై ఆమె గెలుపొందారు. సుమలత భర్త అంబరీష్ కన్నడ నటుడిగా సుపరిచితుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఇటు రాష్ట్రం అటు కేంద్రంలోను మంత్రిగా వ్యవహరించారు. మండ్య జిల్లా నుంచి అంబరీష్ సుధీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగారు.