కర్నూలులో..‘లలిత జ్యువెలర్స్’ షోరూం..
1 min readతొలి ఆభరణం కొనుగోలు చేసిన రాజ్య సభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
- అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన మేయర్, ఎంపీ, ఎమ్మెల్యేలు
పల్లెవెలుగు, కర్నూలు:కర్నూలులో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభించడం అభినందనీయమని, దినదినాభివృద్ధిచెందాలని ఆకాంక్షించారు రాజ్య సభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. శనివారం కర్నూలు నగరం మేడం కాంపౌండ్ లో నూతనంగా నిర్మించిన “లలిత జ్యుయెల్లర్స్” షోరూంను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్య సభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మేయర్ రామయ్య, ఎంపీ డా. సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ ఖాన్ విచ్చేశారు. ఈ సందర్భంగా తొలి బంగారు ఆభరణం కొనుగోలు చేసి చెక్కును షోరూం యజమాని కిరణ్ కుమార్కు టీజీ వెంకటేష్ అందజేశారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ రామయ్య, ఎంపీ డా. సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ ఖాన్ మాట్లాడారు. కర్నూలులో లలిత జ్యువలెర్స్ షోరూం ప్రారంభించడం ప్రశంసనీయమన్నారు. అనంతరం షోరూం యజమాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ 51వ షోరూంను కర్నూలులో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని, బంగారు ప్రియుల అభిరుచికి అనుగుణంగా డిజైన్స్ రూపొందించి విక్రయించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాటసాని ఉమామహేశ్వరమ్మ, కర్నూల్ నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ , సిద్దారెడ్డి రేణుక ,వార్డ్ కార్పొరేటర్ విజయలక్ష్మీ,విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బా రెడ్డి, వైస్సార్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.