మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 17 తేదీ నుండి 19వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు జరగనున్నట్లు ఆలయ ఈవో మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఈనెల 18వ తేదీన శనివారం శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయ చైర్మన్ , ఈవో, ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజ గోపాల్ రెడ్డి, ఈవో మహేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధిగాంచిన మహా పుణ్య శైవ క్షేత్రం శ్రీశ్రీశ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం (పొలతల) పుణ్యక్షేత్రాన్ని ప్రజలు దర్శించుకుని దేవదేవుని కటాక్ష సన్నిధిలో పునీతులు కాగలరని వారు తెలియజేశారు,అలాగే మహా శైవ క్షేత్ర లలో ఒకటైన (పోలతల) మహోత్సవాల సందర్భంగా ఇక్కడ మహా శివునికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఉంటాయని తెలియజేశారు, ఉత్సవాల సందర్భంగా 17వ తేదీ శుక్రవారం రాత్రి వందన డాన్స్ అకాడమీ తాడిపత్రి వారిచే నృత్య ప్రదర్శనలు ఉంటాయని, విధంగా 18వ తేదీన తెల్లవారుజాము 12:30 గంటలకు మహా న్యా స పూర్వక రుద్రాభిషేకం, ఉంటుందని తదుపరి ఉదయం 10 గంటలకు మల్లేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించబడుతుందని వారు తెలియజేశారు, అనంతరం రాత్రి 10 గంటలకు చెక్కభజన, మల్లేశ్వర స్వామి రథోత్సవం ఉంటుందని వారు తెలిపారు, శివరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి సంబంధించి క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, అలాగే వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో ఆలయానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చే విధంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు , అదేవిధంగా భక్తుల సేవలో అన్నదాన సత్రాల ద్వారా అన్న వితరణ గావించడం జరిగిందని వారు తెలియజేశారు, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు, అంతేకాకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది అని వారు తెలియజేశారు, కాగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని వారు పేర్కొన్నారు.