NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మండలం లో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  మండల కేంద్రమైన చెన్నూరు బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీ హనుమయజ్ఞ జయంతి వేడుకలను ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు,తెల్లవారుజామున ఐదు గంటలకు  సుప్రభాత సేవ, ఐదు గంటల 30 నిమిషాలకు మూలవిరాట్ విగ్రహానికి అభిషేక పూజలు, అలాగే అలంకరణలు వేద పండితులచే నిర్వహించడం జరిగింది,8 గంటల నుంచి భక్తుల కోసం సర్వ దర్శనం ఏర్పాటు చేశారు, ఉదయం 9 గంటలకు హనుమ జయంతి సందర్భంగా భక్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు,  మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని సందర్శించే భక్తులకు, గ్రామస్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాలలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు… అదేవిధంగా బుడ్డాయపల్లి వద్ద అభయాంజనేయ స్వామి ఆలయంలో జయంతి సందర్భంగా ఆలయ నిర్వహకులు ప్రత్యేక పూజలు గావించారు , కాగా కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు గావించారు, అనంతరం ఆలయ నిర్వాహకులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎమ్మెల్యే పి,రవీంద్రనాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author