PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరంజీవి తల్లికి క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి !

1 min read

పల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి నటి శ్రీరెడ్డి క్షమాపణ చెప్పారు. గతంలో చిరంజీవి తల్లిని శ్రీరెడ్డి దూషించింది. తాను చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనను క్షమించాలని కోరారు. ‘ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. సోషల్‌ మీడియాలో కూడా చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నా. నేను తప్పుచేశాను.. బుద్ది గడ్డి తిని అలా తిట్టానుపెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి’ అంటూ శ్రీరెడ్డి పేర్కొంది.

         

About Author