నేటి నుంచి శ్రీ శ్రీ శ్రీ హజరత్ అల్లిసాహెబ్ ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో 14వ తేదీ నుంచి శ్రీశ్రీశ్రీ హజరత్ అల్లిసాహెబ్ స్వామి ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14న స్వామివారి గంధం, 15న ఉరుసు, 16న కిస్తీ కార్యక్రమాలు జరుగుతాయని, శ్రీ శ్రీ శ్రీ హజరత్ అల్లిసాహెబ్ ఉరుసును గ్రామంలోని భక్తులు కులమతాలకు అతీతంగా జరుపు కుంటారు. స్వామి వారికి భక్తులు ఇసుకను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామ సమీపంలో ఉన్న హంద్రీలోని ఇసుకను ఎద్దుల బండితో తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించి తమ సమస్యలు తెలుపుకుంటారని, వచ్చే ఏడాదిలో అవి పరిష్కారమవుతాయిన గ్రామస్తు లు నమ్ముతారన్నారు. దీంతో గ్రామంలోని భక్తులతో పాటు ఇతర ఇతర గ్రామాల నుండి భక్తులు ఎద్దుల బండ్ల ద్వారా ఇసుకను స్వామి వారికి సమర్పిస్తారు. చల్లని ఇసుకను సమర్పిస్తే స్వామి చల్లగా తమ కోర్కెలుతీరుస్తాడని నమ్మకం. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారమని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే దర్గా ప్రాంగణంలోనే ఎల్లమాంబదేవి ఆలయం ఉంది. ప్రతి రోజు భక్తులు దర్గాతో పాటు ఎల్లమాంబ ఆలయంలోనూ పూజలు చేస్తారు. దర్గా, ఆలయం పక్కపక్కనే ఉన్న ప్పటికీ ఎటువంటు భేదాభిప్రాయలు లేకుండా రెండు వర్గాల వారు ప్రార్థనలు, పూజలు నిర్వ హిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే దర్గా ప్రాంతమంతా విద్యుత్ అలంకరణలతో ముస్తాబు చేశారు.
ఉరుసు సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు..
గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో 14 ,15, 16 వ తేదీలలో శ్రీశ్రీశ్రీ హజరత్ అల్లి సాహెబ్ ఉరుసు ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ఎస్సై తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా గ్రామంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడిన, అల్లర్లకు ప్రోత్సహించిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.