NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీనాగదేవత ప్రతిష్ట పూజ కార్యక్రమం

1 min read

పాల్గొన్న మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: గురువారం రాయచోటి పట్టణంలో సుద్దలవాండ్లపల్లి రోడ్డు లో వున్న అయ్యప్పస్వామిగుడి, బ్రహ్మంగారి గుట్ట క్రింద శ్రీబడిశెట్టి జయరాం గారు ధర్మపత్ని శ్రీమతి సుశీల గారు మరియు కమిటీ సభ్యులు నూతనంగా నిర్మిస్తున్న శ్రీసుబ్రమణ్యం స్వామి ఆలయంలో ఈరోజు చేస్తున్న నాగప్రతిష్ట పూజ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద్ బాబు గారికి ఘనంగా స్వాగతం పలికి నాగదేవతలకు ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలు అందజేశారు,ప్రసాద్ బాబు గారికి ఘజమాల వేసి శాలువ కప్పి సన్మానం చేశారు, ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన భక్తాదులకు ప్రసాద్ బాబు గారు అన్నదానం ఏర్పాటుచేశారు,అక్కడ ఏర్పాటు చేసిన మాసాపేట వెంకటేశ్వర స్వామి భజన బృందం తో కలిసి పూజలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో సుగవాసి శ్రీనివాసులు,బడిశెట్టి సుబ్బరామయ్య,రిటైర్డ్ MRO గువ్వల చిన్నయ్య,DT రెడ్డన్న,రిటైర్డ్ బెంచ్ క్లర్క్ మనపోటి రామకృష్ణయ్య, భజన బృందం కావలి చిన్నప్ప,కొట్టే లక్ష్మిపతి,రాయల్ టైలర్ వెంకటరమణ,సుగవాసి పాలకొండరాయుడు,ఆదినారాయణ,నూనెశ్రీనివాసులు,అయ్యప్పగుడి ధర్మకర్త బసిరెడ్డి మన్నేరురామాంజనేయులు,బడిశెట్టి రవి, KC ప్రసాద్,కోటి,హర్ష, తదితరులు పాల్గొన్నారు.

About Author