NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సరికొత్త కథాంశంతో ‘శుభస్య శీఘ్రం’.. మీ జీ తెలుగులో!

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్తో భిన్నమైన సీరియల్స్లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ ‘జీ తెలుగు’. కొత్తదనం నిండిన కామెడీ, డాన్స్, సింగింగ్ షోలు, ఆసక్తికర మలుపులతో సాగుతున్నసీరియల్స్ టెలివిజన్ రంగంలో దూసుకుపోతోంది. అదే ఉత్సాహంతో నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా ఇప్పుడు ‘శుభస్య శీఘ్రం’ అంటూమరో కొత్త సీరియల్తో మీ ముందుకు రాబోతోంది. ఇది ఆర్థిక అసమానతలు, ఆత్మాభిమానం మధ్య జరిగే సంఘర్షణగా తెరకెక్కుతున్న ప్రేమకథ. మహేష్ బాబు- కృష్ణప్రియ ప్రధాన పాత్రలలో నటించిన ‘శుభస్య శీఘ్రం’ ఈ నెల 23 నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.ఒక మధ్య తరగతి తల్లికి అండగా ఉండే కూతురు తన కుటుంబాన్ని ఆపదల నుండి ఎలా కాపాడుకుందనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన సీరియల్ ‘శుభస్య శీఘ్రం’. కలవారి అబ్బాయి రాధాగోవింద్ మహేష్ కుటుంబ బాధ్యతలను తలకెత్తుకునే ధైర్యం గల ఆడపిల్ల కృష్ణగా కృష్ణప్రియ జీ కుటుంబంలోకి అడుగు పెడుతున్నారు. కుటుంబమే ప్రధానంగా భావించే హీరో జీవితంలో కృష్ణ ఎంట్రీతో ఏం జరిగింది? ద్వేషంగా మొదలైన పరిచయంలో ప్రేమ ఎలా చిగురించింది? ఉప్పు, నిప్పులా ఉండేవారిద్దరిని ప్రేమ ఎలా ఒకటి చేసింది? అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 23 వరకు వేచి చూడాల్సిందే.అంతేకాదు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను మెప్పిస్తున్న సాండ్ర జయచంద్రన్ , భావన, ఉమాదేవి ఈ సీరియల్లో ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ‘శుభస్య శీఘ్రం’ ప్రారంభంతో మీ అభిమాన సీరియల్స్ ‘దేవతలారా దీవించండి’ సాయంత్రం 6 గంటలకు, ‘రాధమ్మ కూతురు’ సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానున్నాయి. ‘శుభస్య శీఘ్రం’ జనవరి 23 రాత్రి 7 గంటలకు ప్రేక్షకులను అలరించేందుకు రానుంది.. మీ జీ తెలుగులో.

About Author