సచివాలయంలో కంప్యూటర్ల షట్ డౌన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ సచివాలయంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. రేపు సెలవు కావడంతో ఈ రోజే కంప్యూటర్లు షట్ డౌన్ చేసి నిరసన తెలిపారు. ఉద్యోగుల నిరసనతో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.