కడపలో ఎస్ఐ చంద్రారావు ఆత్మహత్య !
1 min read
పల్లెవెలుగువెబ్ : కడపలో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రారావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రారావు కడపలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. స్థానికుల ద్వార సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రిమ్స్ కు మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సమస్యలతో చంద్రారావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.