ఎస్ఐ మారుతి శంకర్ ను సస్పెండ్ చేయాలి
1 min read– అంగన్వాడీ మహిళలపై అసభ్యకర మాటలు:సిఐటియు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మారుతి శంకర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ మహిళలు తమ సమస్యలు పరిష్కారం కోసం గత 11 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని జూపాడుబంగ్లా ఎస్సై మారుతి శంకర్ అంగన్వాడీల పట్ల అసభ్యంగా మాట్లాడిన ఎస్సై మారుతి శంకర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి పక్కిర్ సాహెబ్,టి.ఓబులేష్,మండల నాయకులు వెంకటశివుడు,లింగస్వామి డిమాండ్ చేశారు.శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్, మాటలకు ఫుడ్ కమిషనర్ చైర్మన్ చింత ప్రతాపరెడ్డి వ్యాఖ్యలకు నిరసిస్తూ శుక్రవారం సిఐటియు అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ లో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పక్కిర్ సాహెబ్ మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలుగా చాలా సార్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వేతనాలు పెంచినందుకే సమ్మెలోకి పోయారన్నారు.మండలాల్లో అంగన్వాడీలు శాంతి యుతంగా రాస్తారోకోలు చేయడం జరిగిందన్నారు.ఎస్ఐ మారుతి శంకర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేయని పక్షంలో లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులురాజేశ్వరి,హరిప్రియ,సంజమ్మ, నాగమణి,నారాయణమ్మ,ఉమాదేవి,మంగమ్మ,అరుణ కుమారి,గౌతమి మరియు తదితరులు పాల్గొన్నారు.