క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను బుధవారం ఉదయం మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడి కర్నూలు జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఎస్ఐ హెచ్ ఓబులేష్ మరియు వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని క్రీడాకారులతో వారు అన్నారు.ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి దాతలు:వి విష్ణు,ఎం దాస్,వి అశోక్ లు-20 వేలు,రెండవ బహుమతి దాతలు తువ్వా లోకేశ్వర్ రెడ్డి 12వేలు, మూడవ బహుమతి దాతలు:వి హనుమన్న-6వేలు, డ్రస్ స్పాన్సర్ చేసినవారు వీఆర్వో ఆనంద్,వి సుభాకర్. సహాయ దాతలు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం,టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,బన్నూరు రమణ వి జోషప్ ఈ టోర్నమెంట్ ఏబీఎం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు వి చక్రి,శ్రీకాంత్,జాషువా,ప్రసాద్ తెలిపారు.ఈ టోర్నమెంటులో 37 జట్లు పాల్గొంటున్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రమణ,హనుమన్న,దాస్,బి సతీష్,సుభాకర్,రమేష్, ప్రకాష్,మధు,హరి,మళ్ళీ, సారధి,నవీన్ మరియు ఏబీఎం యూత్ పాల్గొన్నారు.