PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిద్ధా షూటింగ్‌లో జాయినయ్యాడు..

1 min read

సినిమా డెస్క్​: ‘‘ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి’’ అంటూ ట్వీట్‌ చేసింది ‘ఆచార్య’ టీమ్. మెగాస్టార్‌‌ చిరంజీవి, రామ్‌ చరణ్​, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ స్టార్టయ్యింది. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ మళ్లీ ప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. మెడలో కండువా, నుదుటన బొట్టుతో చిరునవ్వుతో కనిపిస్తున్నాడు చరణ్. ఈ మూవీలో అతడు సిద్ధ అనే నక్సలైట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్‌ చరణ్​ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆయనకి జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

About Author