సిద్ధార్థ రెడ్డి పాటలను విడుదల చేసిన మోమిన్ మన్సూర్
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాటలను నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి మైనార్టీ(ఉప్పలదడియ గ్రామం)నాయకులు మోమిన్ మన్సూర్ రెండు పాటలను ఆయన మిడుతూరులో గురువారం ఉదయం జరిగిన సిద్ధార్థ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా ఆయన రెండు పాటలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆపద్బాంధవుడు పేదల కోసం అనునిత్యం ఎప్పుడూ కూడా ఆలోచించే వ్యక్తి మాసిద్ధార్థ రెడ్డి అన్న అని ఆయన గురించి ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తదితర వాటి గురించి పాటలను రాయించాలనే తపన నాలో ఉండేదని అందుకు గాను హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖ గాయకులతో ఈరెండు ఈపాటలను తయారు చేయించి సిద్ధార్థన్న జన్మదిన సందర్భంగా ఈపాటలను ప్రజలకు అంకితం చేస్తున్నానని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు మైనార్టీ నాయకులు మోమిన్ మన్సూర్ అన్నారు.