ధరలు ఎప్పటి నుంచి తగ్గుతాయంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : అక్టోబరు నుంచి నుంచి ధరల పరిస్థితి క్రమంగా మెరుగుపడవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ధీమా వ్యక్తం చేశారు. పటిష్ఠమైన, స్థిరమైన వృద్ధి సాధన దృష్టితో ధరలను నియంత్రించేందుకు ఆర్‌బీఐ ద్రవ్యవిధాన పరమైన చర్యలను కొనసాగించనుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఆర్థిక సంస్థలపై ప్రజల నమ్మకం, విశ్వాసానికి ద్రవ్యోల్బణమే కొలమానమని కౌటిల్య ఆర్థిక సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం సరఫరా పరిస్థితులు సానుకూలంగానే కన్పిస్తున్నాయి. పలు స్థూల ఆర్థికాంశాలు ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి పునరుద్ధరణనే సూచిస్తున్నాయి. మా లెక్క ప్రకారం, అక్టోబరు నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు, తద్వారా ధరలు ప్రస్తుత రికార్డు గరిష్ఠ స్థాయిల్లోనే స్థిరపడవచ్చన్న భయాలను తొలిగిపోనున్నాయ’’ని ఆయన పేర్కొన్నారు.