ఘనంగా డా. సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్ ప్రారంభోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఘనంగా డాక్టర్ సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్ ప్రారంబొత్సవ కార్యక్రమం ను ప్రారంభించిన కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు , జిల్లా అధ్యక్షులు జై లక్ష్మీ నరసింహ యాదవ్ మరియు లక్కీ టు బ్రదర్స్.ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ యాదవ్ లక్కీ టు నరసింహ యాదవ్ మాట్లాడుతూ రోజూ రోజుకి జబ్బుల పాలు అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.కార్పొరేట్ వైద్యం పొందిన జబ్బులు మాత్రం తగ్గటం లేదు,, దీర్ఘకాలిక జబ్బులతో సుదీర్ఘంగా బాధపడుతున్న వారందరికీ అత్యాధునిక హోమియో వైద్య అందుబాటులో ఉండబోతుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు అభ్యర్థి j. లక్ష్మీ నరసింహ యాదవ్ ఓపెనింగ్ ను ప్రారంభిస్తూ ఈ కార్యక్రమంలో తెలిపారు.14 మే 2023 వ తేదీన కర్నూలు పట్టణం నందు డాక్టర్ సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్ కర్నూల్ బ్రాంచ్ ఘనంగా జరిగినది. ఏ వైద్యానికి తగ్గకపోతే హోమియోపతి వైద్యమే సరణ్యమని కాబట్టి హోమియోపతి హాస్పిటల్స్ మరిన్ని అందుబాటులోకి రావాలని ప్రజలందరి ఆరోగ్యం మెరుగుపడాలని ఆశిస్తున్నానని లక్కీ టు బ్రదర్స్ ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొంటూ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.జబ్బులు ముదిరే వరకు వేచి ఉండకుండా ఏ జబ్బు వచ్చినా హోమియో వైద్యం ని ప్రధమంగా వాడాలని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవడం వలన శరీరంలో ఉన్న అవయవాల పనితీరు దీర్ఘకాలంగా కొనసాగుతుందని తద్వారా దీర్ఘకాలిక జబ్బులు రావని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ బండారు నాగేశ్వర రావు యాదవ్ , మరియు డాక్టర్ ముత్యాల రాగ సులోచన గార్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అనేకమంది వైద్యులు , నగర ప్రముఖులు పాల్గొన్నారు.