NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడండి..

1 min read

బాదుడే బాదుడు కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి..
పల్లెవెలుగు, వెబ్ పాణ్యం : పాణ్యం నియోజకవర్గం కందికాయపల్లే గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నార చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం నాడు పాణ్యం టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరతారెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో ప్రజల పడుతున్న ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని పేద ప్రజలను ధరల భారం మోపి వైసిపి ప్రభుత్వం నడ్డి విరుస్తుందని కొండలు గుట్టలను కబ్జాలు చేసుకుని దోచుకో దాచుకో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు వచ్చే ఎన్నికలలో టిడిపి పార్టీ అధికారంలో వస్తే పేదలు సంతోషంతో ఉంటారని ప్రజలు టిడిపికి అధికారాన్ని కట్టబెట్టాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మల్ల ఈశ్వర్,వెంకట సుబ్బయ్య,రామ సుబ్బయ్య,శేషు,సుబ్బారాయుడు, బాల శంకర్,మండల అధ్యక్షుడు జయారామి రెడ్డి,ఆలమూరు గోవింద రెడ్డి,శేఖర్ రెడ్డి,సునీల్ రెడ్డి,రామ్మోహన్ నాయుడు,మద్దూరు సుధాకర్ రెడ్డి, ఈశ్వర్ కుమార్,రెడ్డి,పిన్నపురం రమణ,దుబాయ్ శీను, తిరుపాలు,తదితరులు పాల్గొన్నారు.

About Author