PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోగా గాయ‌కుడు సిద్ శ్రీరామ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ గాయ‌కుడు సిద్ శ్రీరామ్ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు. త‌న గ‌మ్మ‌త్తైన గాత్రంతో ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించుకున్నారు. ఆయ‌న మెలోడీల‌కు యువ‌త‌లో ప్ర‌త్యేక స్థానం ఉంది. అయితే ఈ యువ గాయ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా తెరంగేట్రం చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌ణిర‌త్నం క‌డ‌లి సినిమాతో గాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ చ‌ర్చ‌లు ముగిశాయని, క‌థ న‌చ్చ‌డంతో సిద్ శ్రీరామ్ సినిమాకు ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా ? లేక నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తారా ? అన్న విష‌యం తేలాల్సి ఉంది.

                                        

About Author