వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ
1 min read
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం సమీపంలోని చిగురుమాన్ సర్కిల్ నందు ఎస్ఐ పి. నాగార్జున వారి సిబ్బందితో శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీలో సరైన పత్రాలు లేని వారికి, త్రిబుల్ డ్రైవింగ్ వారికి హెల్మెట్ లేని వారికి చలానాలు విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించి తీసుకోవాలని ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
