సిరివెన్నల ఇకలేరు.. ఆయన చనిపోవడానికి కారణం ఇదే !
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ పాటల రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి కన్నుమూశారు. హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పలువురు అభిప్రాయపడ్డారు. చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. `సిరివెన్నెల మనకిక లేదు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు` అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. ` సిరివెన్నల లాంటి గొప్పకవి మనకు తారసపడటం కష్టమే. సరస్వతి దేవి ఒడిలో సేదతీరుతున్నట్టు ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అంటూ చిరంజీవి సోషల్ మీడియా ద్వార తన ఆవేదనను పంచుకున్నారు.
సిరివెన్నెల చనిపోవడానికి కారణం ఇదే :
సిరివెన్నల సీతారామ శాస్త్రి చనిపోవడానికి గల కారణాలను కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు వెల్లడించారు. ` ఆరేళ్ల క్రితం క్యాన్సర్ తో సగం ఊపిరితిత్తి తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడ చేయాల్సి వచ్చింది. వారం క్రితం ఊపిరితిత్తి మరోవైపు క్యాన్సర్ వస్తే దాంట్లో కూడ సగం తీసేశాం. ఆ తర్వాత రెండ్రోజులు బాగానే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్స్ ట్రీట్ మెంట్ కోసం కిమ్స్ తీసుకొచ్చారు. రెండ్రోజులు వైద్యం అందిస్తే బాగానే రికవరీ అయ్యారు. ప్రికాస్టమీ కూడ చేశాం. 45 శాతం ఊపిరితిత్తులు తీసేశాం కాబట్టి 55 శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆక్సినేషన్ సరిగా లేక ఎక్మో మిషన్ పై పెట్టాం. గత ఐదు రోజుల నుంచి ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు ` అంటూ కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు.