ఆస్పత్రిలో `సిరివెన్నెల`.. హెల్త్ బులెటిన్ విడుదల
1 min read
పల్లెవెలుగు వెబ్ : ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పై వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కిమ్స్ యాజమాన్యం స్పందించింది. రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని, లంగ్స్ కు సంబంధించిన సమస్య నుంచి ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.