NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రిమిన‌ల్స్ తో కూర్చుని పోలీసుల్ని బెదిరిస్తారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఆత్మూరులో జరిగిన ఘ‌ట‌న పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రాన్ని, పోలీసు వ్య‌వ‌స్థ‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఏం చేయాల‌నుకుంటుందోన‌ని అన్నారు. ఆత్మ‌కూరులో పోలీసుల్ని, బీజేపీ నేత‌ల్ని చంపడానికి ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. క్రిమిన‌ల్స్ తో కూర్చుని నేరుగా పోలీసుల్నే బెదిరిస్తారా ? అంటూ ప్ర‌శ్నించారు. ఈ కుట్ర వెనుక వైసీపీ నేత‌లు ఉన్నార‌న్న విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు. క‌ర్నూలు జిల్లాలో ఇటీవ‌ల రెండు వ‌ర్గాల మ‌ధ్య ఓ నిర్మాణం విష‌యంలో గొడ‌వ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పెద్దఎత్తున ఇరువ‌ర్గాల మధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది.

                               

About Author