PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నైజీరియాలో కూర్చుని.. హైద‌రాబాద్ లోని బ్యాంక్ డ‌బ్బు కొట్టేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మహేష్ బ్యాంకు నిధుల గోల్మాల్ కేసులో కీలక పురోగతి కనిపించింది. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి నేరగాళ్లు నిధులను కొట్టేశారు. బ్యాంకు ఖాతాలతో పాటు సర్వర్‌లో చొరబడి 14 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని నగర పోలీసులు గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇదే తరహాలో మూడు బ్యాంకుల నిధులను నేరాగాళ్లు కొట్టేశారు. అందులో.. మహారాష్ట్రలో బ్యాంక్ ఆఫ్ బరోడా, తెలంగాణ కోపరేటివ్ బ్యాంకు, మహేష్ నిధులను లూటీ చేశారు. మహేష్ బ్యాంకు కేసులో ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుల దోపిడిలపై కీలక విషయాలను హైదరాబాద్ సీపీ వెల్లడించనున్నారు.

                                   

About Author