వరద సహాయక చర్యల్లో సీతక్కకు తప్పిన ప్రమాదం !
1 min readపల్లెవెలుగువెబ్ : వరద సహాయక చర్యల్లో పాల్గొన్న తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వరద సహాయక చర్యలకు వెళ్తుండగా గోదావరి మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న బోటు ఆగిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు. ఈదురు గాలుల తాకిడికి బోటు ఒడ్డుకు కొట్టుకు రావడంతో ఆమె సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 12న వరద బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ములుగు జిల్లా పొదుమూరు సమీపంలో గోదావరి వరద ఉద్ధృతి వల్ల కోతకు గురైన భూములను పరిశీలించారు. అలాగే పునరావాస కేంద్రానికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. వారికి పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.