సీతారాం ఏచూరి కుమారుడు మృతి: కరోన ఎఫెక్ట్
1 min read
పల్లెవెలుగు వెబ్: ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు మృతి చెందారు. కరోన కారణంగానే ఆయన మరణించినట్టు సీతారాం ఏచూరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన పెద్ద కొడుకు ఆశిష్ కరోన బారినపడి చికిత్స పొందుతున్నాడని, గురువారం ఆశిష్ ఏచూరి మరణించినట్టు సీతారాంఏచూరి తెలిపారు. తన కొడుకు చికిత్స సమయంలో సహకరించిన వైద్యలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన కొడుకు ఆపత్కాలం ఉన్నప్పుడు సహకరించి.. అండగా ఉన్నవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.