PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

` సీతారామం` క‌లెక్ష‌న్స్ చూస్తే మతిపోతుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన సీతారామం మూవీని హను రాఘవపూడి తెరకెక్కించాడు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న థియేటర్లలో రిలీజైంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.60 కోట్ల గ్రాస్‌, రూ.3.05 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ వసూళ్లు కొంత పెరగడంతో రూ.7.25 కోట్ల గ్రాస్‌ రాగా రూ.3.63 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు రెట్టింపయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే సీతారామం ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. మొత్తానికి సీతా, రామ్‌ల మ్యాజిక్‌ ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది.

                                            

About Author