ప్రభుత్వ మద్యం దుకాణాల వద్దే… సిట్టింగ్..!
1 min read– అనుమతిలేకపోయినా.. తినుబండారాలు ఏర్పాటు..
– పట్టించుకోని సెబ్, సివిల్ పోలీసులు..
పల్లెవెలుగు వెబ్, రుద్రవరం: ప్రభుత్వ దుకాణాల వద్దే.. అనుమతి లేకపోయినా తినుబండారాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మద్యం బాబులు అక్కడే సిట్టింగ్ వేస్తున్నారు. మద్యం మత్తులో మందుబాబులు గొడవలు పడి ఘర్షణలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం దుకాణాల వద్ద ఎలాంటి తినుబండారాలు, కూల్ డ్రింక్స్ వాటర్ ప్యాకెట్లు విక్రయించ రాదు. అలాగే దుకాణం వద్ద సిట్టింగ్లు వేసి మద్యం సేవించకూడదు. మండలంలో కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా చిరు దుకాణాలు ఏర్పాటు చేసి తినుబండారాలు , కూల్ డ్రింక్స్ , వాటర్ ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. చిరు దుకాణాలు ఏర్పాటు చేయకుండా దుకాణం వద్ద మందుబాబులు సిట్టింగ్ వేయకుండా చూడాల్సిన సెబ్ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు చిరు దుకాణాల యజమానులు వద్ద ముడుపులు పుచ్చుకుని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మండల కేంద్రమైన రుద్రవరం తో పాటు ఆలమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తినుబండారాల చిరు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మద్యం దుకాణం వద్ద తినుబండారాలు కూల్ డ్రింక్స్ వాటర్ ప్యాకెట్లు లభించడంతో మందు బాబులు అక్కడే సిట్టింగ్ వేస్తున్నారు. మద్యం దుకాణం వద్ద పరిసర ప్రాంతంలో మందుబాబులు మద్యం సేవించి మద్యం మత్తులో గొడవలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మద్యం దుకాణం వద్ద తినుబండారాలు దుకాణాలు ఎత్తివేయాలని దుకాణం వద్ద మద్యం సేవించ కుండా చర్యలు తీసుకోవాలని ఆలమూరు రుద్రవరం గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
తినుబండారాల దుకాణాలకు అనుమతులు లేవు: ఎక్సైజ్ ఎస్సై కిషోర్ కుమార్..
రుద్రవరం, ఆలమూరు గ్రామాలలోని ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద చిరు దుకాణాలు ఏర్పాటు చేసి తిను బండారాలు కూల్డ్రింక్స్ వాటర్ ప్యాకెట్లు విక్రయిస్తున్నారని ఈ దుకాణాలకు అనుమతులు ఉన్నాయా అని ఎక్సైజ్ ఎస్సై కిషోర్ కుమార్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా మద్యం దుకాణాల వద్ద చిరు దుకాణాలు నిర్వహించుకునేందుకు ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా ఎవరైనా దుకాణాలు ఏర్పాటు చేసినా వాటిని వెంటనే తొలగిస్తాం. దుకాణాల వద్ద మద్యం సేవించేందుకు సహకరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము.