PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరు గ్యారెంటీలు.. తప్పకుండా అమలు చేస్తా..:టీజీ భరత్​

1 min read

సీతారాం నగర్‌లో విజయవంతంగా టీజీ భరత్ భరోసా యాత్ర

కర్నూలు, పల్లెవెలుగు:  ఆరు గ్యారెంటీలను ఐదేళ్లలో అమలు చేసి కర్నూలు ప్రజల కష్టాలన్నింటిని తీరుస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని సీతారాం నగర్‌లో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం ఆయన చేపట్టారు.  ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ.. క‌ర్నూలు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి న‌గ‌రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు 6 గ్యారంటీల‌తో మేనిఫెస్టో రూపొందించిన‌ట్లు చెప్పారు. ప‌దేళ్లపాటు అన్ని వార్డుల్లో తిరిగి స‌మ‌స్యలు తెలుసుకొని ఈ మేనిఫెస్టోను త‌యారు చేశాన‌న్నారు. క‌ర్నూలు న‌గ‌రాన్ని స్మార్ట్ సిటీ చేయ‌డం, కొత్త ప‌రిశ్రమ‌లు తీసుకురావ‌డం, మ‌హిళ‌ల‌కు భ‌ద్రత‌, ఆర్థిక భ‌రోసా, ప్రతి ఇంటికి సంక్షేమం, అంద‌రికీ ఆరోగ్యం బాగుండాలి.. అందులో మ‌న క‌ర్నూలు ముందుండాలి, క‌ర్నూలుకు రాష్ట్ర హైకోర్టు బెంచ్ పేరుతో ఆరు గ్యారంటీల‌ను రూపొందించానని ప్రజలకు వివరించారు. పార్టీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌తో పాటు త‌న ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తాన‌న్నారు.

అన్ని వర్గాలకు.. మేలు జరిగేలా..:

ఈ 6 గ్యారంటీల‌ను అమ‌లు చేయ‌డం ద్వారా న‌గ‌రం అభివృద్ధిలో ఎంతో ముందుకెళుతుంద‌ని టీజీ భ‌ర‌త్ తెలిపారు. కుల‌, మ‌త బేధాలు లేకుండా అన్ని వ‌ర్గాల‌కు మేలు జ‌రిగేలా తాను కృషి చేస్తాన‌న్నారు. పార్టీ ప్రక‌టించిన మేనిఫెస్టో ప్రతి ఒక్క‌రికీ అందాలంటే త‌న‌లాంటి స‌రైన నాయ‌కుడు ఎమ్మెల్యే గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఐదేళ్ల‌లో ఈ గ్యారెంటీలు అమ‌లు చేయ‌ని ప‌క్షంలో 2029 ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేయొద్ద‌ని, తానే రాజ‌కీయాల నుంచి తప్పుకుంటాన‌ని ఆయన ప్రజలకు చెప్పారు. తన ప్ర‌త్య‌ర్థులు కేవ‌లం కులంతో రాజ‌కీయం చేస్తార‌న్నారు. తాము మాత్రం ప్ర‌జాసేవ‌, అభివృద్ధి అనే మంత్రంతో ప్ర‌జ‌ల్లో ఉంటున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు పొర‌పాటు చేయ‌కుండా ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు టీడీపీకి వేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జ్ హరిబాబు, మనోజ్, ప్రభాకర్, చంద్రశేఖర్, కృష్ణవేణి, లక్ష్మీజ్యోతి, సురేంద్ర రెడ్డి, లోకేష్, యేసు, రాజశేఖర రెడ్డి, ఈశ్వరయ్య, సురేష్‌, నరేష్, ఈరన్న, జనసేన నాయకులు పవన్, బూత్‌ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.

About Author