ఏపీలో ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో 6 అణు విద్యుత్ రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6 అణు విద్యుత్ రియాక్టర్లు చేస్తారు. 1,208 మెగావాట్ల సామర్థ్యం చొప్పున రియాక్టర్లను ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొంది. రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు పీఎంవో కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ సమాధానం ఇచ్చారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం అంచనా పెట్టుబడులు 2 లక్షల కోట్ల వరకు ఉంటాయని కేంద్రం తెలిపింది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం పేర్కొంది.