NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరు సార్లు ఎంపీ.. పైసా ఆస్తి లేదు

1 min read

తిరుప‌తి: తిరుప‌తి ఉపఎన్నిక సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా చింతా మోహ‌న్ కాంగ్రెస్ అధిష్టానం ప్రక‌టించింది. నామినేష‌న్ సంద‌ర్భంగా చింతా మోహ‌న్ అఫిడ‌విట్ స‌మ‌ర్పించారు. ఇందులో ఆయ‌న పొందుప‌రిచిన ఆస్తుల వివరాలు ఆంద‌రినీ ఆశ్చర్యప‌రిచాయి. ఆయ‌న పేరు మీద ఒక్కపైసా కూడ ఆస్తి లేదు. ఆయ‌న భార్య పేరు మీద మాత్రం 3.27 కోట్లు ఆస్తులున్నాయి. ఇందులో 19 ల‌క్షల బ్యాంకు అప్పు కూడ ఉంది. ఆయ‌న అస్తుల వివ‌రాలు చూసి అంద‌రూ ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ‌, రేపు ఓ స‌ర్పంచ్ గా గెలిస్తేనే ల‌క్షల్లో సంపాదిస్తున్నారు. ఈయ‌న మాత్రం 6 సార్లు ఎంపీగా గెలిచిన‌.. ఆయ‌న పేరు మీద పైసా ఆస్తి లేదంటే ఆశ్చర్యం కాక ఇంకేంటి. మొద‌టిసారి చింతా మోహ‌న్ 1984లో ఎంపీగా తిరుప‌తి లోక్ స‌భ స్థానం నుంచి గెలిచారు. త‌ర్వాత 1989, 1991,1998,2004,2009 ఇలా ఆరు సార్లు తిరుప‌తి ఎంపీగా గెలిచారు. ఒకే లోక్ స‌భ స్థానం నుంచి ఇన్ని సార్లు గెల‌వ‌డం ఒక కూడ ఒక అరుదైన విష‌య‌మే.

About Author