PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరేళ్ల బుడ‌త‌డు.. స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత్‌కు చెందిన అశ్వత్‌ కౌశిక్‌ ప్రపంచ క్యాడెట్‌ చెస్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. అశ్వ‌త్ వ‌య‌సు ఆరేళ్లు. గ్రీస్‌లో జరిగిన వరల్డ్‌ క్యాడెట్‌ అండ్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిఫప్లో ఓపెన్‌ అండర్‌-8 కేటగిరీలో చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించాడు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను 8.5 పాయింట్లు సాధించిన అశ్వత్‌ అందరికంటే ముందంజలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. టోర్నీలో ఏడోసీడ్‌గా బరిలోకి దిగిన అశ్వత్‌.. టైటిల్‌ నెగ్గే క్రమంలో టాప్‌సీడ్‌ మోదిత్‌ ఆరోహ్‌ , రాఘవ్‌ పాఠక్‌ లాంటి స్టార్లకు షాకివ్వడంతో పాటు ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా నిలిచాడు.

                                        

About Author