PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘స్కిల్​ హబ్​’..  నిరుద్యోగులకు వరం..

1 min read

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు పెట్టడం మా అదృష్టం

శిక్షణ ఇస్తున్న మౌనిక మేడంకు రుణపడి ఉంటాం

టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు

పల్లె వెలుగు అన్నమయ్య జిల్లా బ్యూరో:అన్నమయ్య జిల్లా కేంద్రంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని యువతకు మరియు  మహిళలకు  వారి నైపుణ్యాన్ని పెంపొందించే విధముగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ హబ్ లు ఏర్పాటుచేసి  తద్వారా మహిళలకు టైలరింగ్   శిక్షణ ఇచ్చి  ఉపాధి కన్పించడం మా కు ఒక వరం  లాంటిదని శిక్ష తీసుకున్న మహిళలు తెలిపారు . అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రం గా ప్రభుత్వ పాలిటెక్నీక్  కళాశాల నందు 60 మంది మహిళలకి టైలరింగ్ నందు శిక్షణ ఇస్తున్నారు . ఇక్కడ కి జిల్లా నలుమూలల మండలాల నుండి మహిళలు శిక్షణ తీసుకొంటున్నారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు .ఇక్కడ 3 నెలల పాటు టైలరింగ్ ఉచిత శిక్షణ ఇస్తున్నారు . ఇక్కడ జిల్లా స్థాయిలో గుర్థింపు పొందిన అనుభవజ్ఞులైన  టైలరింగ్  మాస్టర్ ద్వారా  శిక్షణ ఇప్పిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా టైలరింగ్ శిక్షణ ఇస్తున్న మౌనిక మేడంకు మేము రుణపడి ఉంటామన్నారు.అదేవిధంగా టైలరింగ్ శిక్షణ ద్వారా మేము జీవనోపాధి పొందినందుకు మాకు గర్వంగా ఉందన్నారు.

* జిల్లాలో ప్రతి నియోజక వర్గం లో స్కిల్ హబ్ ల ద్వారా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువతకి మహిళలకి ఉపాధి కల్పిస్తున్నాము అని అందులో భాగం గానే ఇక్కడ టైలరింగ్  మరియు జూనియర్ సాఫ్ట్వేర్ కోర్సల యందు 3 నెలల పాటు సంపూర్ణ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాము అని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి హరికృష్ణ తెలియచేసారు .

*స్కిల్ హబ్ ల ద్వారా యువతకి శిక్షణ ఇచ్చి వారికి క్యాంపస్  ఇంటర్వ్యూలు నిర్వహించి  ఉద్యోగ అవకాశయాలు  కల్పిస్తున్నట్టు పాలిటెక్నీక్ కళాశాల ప్రిన్సిపాల్ శివశంకర్ తెలియచేసారు  .

ఫ్యాషన్​ డిజైన్​లో..శిక్షణ:

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి టైలరింగ్ శిక్షణ చాలా  ఉపయోగపడుతుందని వారు. ఇందులో వివిధ రకాల ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ ఇస్తున్నాము అని ఇందులో మూడు నెలలపాటు వారికి సంపూర్ణ శిక్షణ ఇచ్చి పంపుతామన్నారు. మహిళలలు ఇక్కడ నేర్చుకొన్న శిక్షణను సక్రమంగా సద్వినియోగం చేసుకోగలిగితే వారు ఆర్థికంగా బలపడుతారన్నారు. ఆర్టికకంగా ఎదిగినప్పుడే మన కుటుంబం మన పిల్లల భవిష్యత్   బాగుంటుంది అని టైలరింగ్ టీచర్ మౌనిక పేర్కొన్నారు  .

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతున్నా స్కిల్ హబ్ సెంటర్స్ యువతకి మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ఇక్కడకి గ్రామీణ ప్రాంతాల లో నిరుద్యోగ  యువతను మహిళల ను గుర్తించి వారికి అవగాహన కల్పించి శిక్షణ లో చేర్పిస్తున్నాము.  ఇక్కడ సంపూర్ణా శిక్షణ తీసుకొన్నమహిళలకి బ్యాంకు అధికారులతో సంప్రదించి  ఆర్థికంగా సహకారం అందించే  విధముగా లోన్ లను ఇప్పించడానికి ప్రయత్నం  చేస్తున్నాము అని గుడ్ నైబర్స్ ఇండియా ఆర్గనైజమేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ నాగేశ్వర్ తెలియచేసారు. స్కిల్ హబ్ ల   ద్వారా శిక్షణ పొందేందుకు  సహకారం అందించిన జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ గారికి స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి   శిక్ష పూర్తి చేసుకున్న మహిళలు  కృతఙ్ఞతలు  తెలిపారు.

About Author