నైపుణ్య బోధనే నూతన విద్యా విధాన లక్ష్యం
1 min readపల్లెవెలుగు వెబ్, చిట్వేలి : ఆగస్టు నెల 16 వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం అవుతున్న తరుణంలో శనివారం ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు కోడూరు టౌన్ నందు గల మెయిన్ స్కూల్, గాంధీనగర్ స్కూల్ను పరిశీలించారు. తొలిదశలో నాడు-నేడు కింద చేపట్టిన పనులను, పాఠశాల ప్రహరీ పై గీసిన ఆకర్షణీయమైన పెయింటింగ్ ను, కొత్తగా ఏర్పాటుచేసిన టేబుల్ బల్లలను పరిశీలించారు. మెయిన్ స్కూల్ నందు ప్రహరి గోడ కు సంబంధించిన స్థల వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని సబ్ ఇన్స్పెక్టర్ పెద్ద ఓబన్నను ఆదేశించారు. నాడు- నేడు పనుల్లో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, పూర్తి పారదర్శకంగా పనులు జరగాలని, పై నుంచి కింది స్థాయి వరకు ఎక్కడ అవినీతిని సహించేది లేదని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామయ్య, వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, క్షత్రియ నాయకులు హేమవర్మ, సుధాకర్ రాజు, సుకుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి,రమేష్, నాగేంద్ర, నందా బాల, రత్తయ్య పాల్గొన్నారు.