PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓట్లు అమ్ముకున్నంత కాలం బానిసలమే… దండు వీరయ్య

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: మనలో రాజకీయ చైతన్యం రావాలి ఓట్లు అమ్ముకున్నంత కాలం బానిసలమే అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ అన్నారు స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్బులో శనివారంజరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాట్లాడుతూ పేద మహిళలకు ఇచ్చే భూములపై అమ్ముకునే హక్కు లేని చట్టం రావాలని ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆంధ్రులకు వివిధ కుల వృత్తుల వారికి దళిత గిరిజన వెనుకబడిన కులాలకు సర్వీస్ ఇనాం భూములు జీవనోపాధికి ఇచ్చి ఉన్నదని,  స్వాతంత్రం వచ్చేవరకు ఆ భూములను అమ్ముకోవడానికి ఎటువంటి హక్కు ఉండేది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత 1956 ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చినతర్వాత కులవృత్తిలో వారి విలువైన సర్వీస్ ఇనాం భూములు పూర్తిగా అన్యాక్రాంతము అయినవని ఆయన అన్నారు 1976లో భూ పరిమితి చట్టం అమలు చేయడం ద్వారా భూస్వాముల దగ్గర పరిమితికి మించి ఉన్న భూములను పేదలకు పంపిణీ చేశారని, ఈ భూములు అన్యాక్రాంతం రాకుండా ఉండేందుకు గాను పి. ఓ .టి యాక్ట్ తీసుకొచ్చిందని, పేదలకు  ఇచ్చే భూములు కొనడం గాని అమ్ముకోవడం గాని చట్టరీత్యా నేరమని ఈ చట్టం తీసుకురావడం జరిగిందని ల్యాండ్ సీలింగ్ భూములు పేదల అప్పుల పేరుతో ఆ భూములను చట్టవిరుద్ధంగా భూస్వాములే  స్వాధీనం చేసుకొని అక్రమంగా రెవెన్యూ అధికారులు చేత పట్టాదారు పాసుపుస్తకాలు పొంది దళితులకు చెందకుండా దశాబ్దాలు కాలంగా భూములు సాగులో ఉన్నాయని పేరుతో కోర్టుకు వెళ్లి పేదవారికి భూములు తిరిగి రానికుండా వారు పలుకుబడి ఉపయోగించుకుని పేదవారు కడుపులు కొట్టారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అన్నారు రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో అసైన్డ్ భూములు బదలాయింపు నిషేధిత సవరణ చట్టం  ప్రవేశపెట్టారని దళితులు అగ్రవర్ణాల భూస్వాములను భూషములను వారి పక్షాన ఉన్న రాజకీయ నాయకులు ఎదిరించి లేక కోట్ల విలువ చేసే భూములను వదులుకున్నారని,  ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి దళిత గిరిజన మహిళకు 3ఎకరాల భూమిని పంపిణీ చేయాలని  ఎమ్మార్పీఎస్ దళిత మహిళలు పోరాటం రాష్ట్రంలో మహిళల పేదరికం నిర్మూలన కోసం 54 పైగా అసైన్డ్ లంకా భూములను ప్రభుత్వ పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం మేము హర్షిస్తున్నామని అన్నారు. పేదలకు ఇచ్చే భూములను గతంలో లాగా  అన్యాక్రాంతం కాకుండా 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునే అవకాశం లేకుండా తరతరాలుగా భూమి వారి పేరు మీద గాని వారి వారసత్వం పేరు మీద గాని ఉంటేనే మహిళలు ఆత్మగౌరవంగా జీవిస్తారని లేకపోతే 20 సంవత్సరాలు తర్వాత పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు అగ్రవర్ణాల చేతిలోకి పోతాయని, అలా కాకుండా అమ్ముకోవడం- కొనడం చట్టరీత్యా నేరం అందుకు శిక్షలు  విధించే చట్టం రావాలని రెవెన్యూ అధికారులు అక్రమంగా ఆన్లైన్ నమోదు చేయడం నకిలీ పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం లేకుండా చట్టం తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో  రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author