నిద్ర లేమితో.. రుగ్మతలెన్నో .. !
1 min read
8 గంటలు నిద్ర… ఆరోగ్యానికి రక్ష
- ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. రమేష్ బాబు , మానస క్లినిక్, కర్నూలు
- అంతర్జాతీయ నిద్రా దినోత్సవము మరియు ప్రపంచ సంతోష దినోత్సవం
కర్నూలు, న్యూస్ నేడు: మనిషి శారీరకంగా…మానసికంగా ఎంత శ్రమించినా… రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు తప్పనిసరిగా నిద్ర పోవాలని, లేదంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. రమేష్ బాబు. అంతర్జాతీయ నిద్ర మరియు ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా శుక్రవారం కర్నూలు నగరం ఎన్.ఆర్. పేటలోని మానస క్లినిక్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధునిక సమజంలో నిరంతరం సంపాదనపై దృష్టి సారిస్తూ.. నిద్రకు ప్రాధాన్యమివ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిద్ర లేమి వలన తీవ్రమైన తలనొప్పి, విసుగు, పనిమీద ఏకాగ్రత లోపించడము, చిన్న చిన్న విషయాలకు సహనము కోల్పోయి ఇతరుల మీద కోపోధ్రిక్తులగుట, ఆందోళన Anxiety disorder), వ్యాకులత (Depression), రక్తపోటు మొదలగు వాటితోపాటు వాహన దారులలో ట్రాఫిక్ accidents తద్వారా విలువైన ప్రాణాలను కోల్పోవడము మరియు షుగర్ వ్యాధి (Diabetes) , గుండె పోటు, తీవ్రమైన మానసిక రుగ్మతలు (స్కిజోఫ్రీనియా, మహా మతిమరుపు (Dementia)) సంభవించే ప్రమాదమున్నదన్నారు. కనుక ప్రతి ఒక్కరు ప్రతి దినము రాత్రి కనీసము 7-8 గంటలు ప్రశాంతమైన నిద్ర పోవాలన్నారు. దీనికోసము ధ్యానము, యోగా, అతిగా ఆలోచంచడాన్ని నియంత్రించడము, ధూమపానము & మధ్యపానములకు దూరంగా ఉండటం, అసాధ్యమైన క్లిష్టమైన జీవిత సమస్యలను శక్తివంతమైన సమయానికి వదిలేసి ప్రశాంతంగా నిద్రించాలన్నారు. ఆరోగ్యకరమైన నిద్రను అనుభవిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మనమందరమూ ఉండాలని డా. రమేష్ బాబు ప్రజలకు సూచించారు.