ప్రయాణం సాఫీగా.. రోడ్లకు మరమ్మతులు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని రహదారులు మరమ్మతులకు గురవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో మరమ్మతులకు గురైన రోడ్లకు ప్యాచ్ వర్క్ చేయాలని ఆదేశాలతో సోమవారం నాడు పంచాయతీరాజ్ డి గంగాధర్ రెడ్డి గని పైబోగుల. గడివేముల నుండి కొర్రపోలురు రహదారిని పరిశీలించారు ఈ సందర్భంగా డి ఈ మాట్లాడుతూ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ కంపెనీ కోట కింద గని నుండి పైబోగులకు తారు తో గుంతలు పూడ్చడానికి 26 లక్షలు మంజూరైనట్టు అలాగే గడివేముల నుండి కొర్రపోలురు రహదారి వరకు బిటి రోడ్డుకు 23 లక్షలు మంజూరైనట్టు త్వరలోనే పనులను మొదలు పెడతామని తెలిపారు మండలంలో మిగిలి ఉన్న మరమ్మతులకు గురైన రోడ్లను త్వరలోనే అనుమతులు మంజూరు చేసి వాటిని కూడా మరమ్మత్తులు చేస్తామని డి ఈ తెలిపారు ఈ కార్యక్రమంలో పిఆర్ ఇంజనీర్ భాస్కర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.