PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రోల‌ర్స్ కి మంచు ఫ్యామిలీ హెచ్చ‌రిక‌.. 10 కోట్ల దావా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సోషల్‌ మీడియాలో తమపై వస్తున్న ట్రోల్స్‌ను తక్షణమే తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని, రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామని మంచు ఫ్యామిలీ హెచ్చరించింది. ఈ మేరకు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తరఫున శేషు కుమార్‌ అనే వ్యక్తి ట్రోలర్స్‌ను హెచ్చరిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో మంచు ఫ్యామిలీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై చర్య తీసుకోవడం ఆలస్యమైతే మంచు ఫ్యామిలీ మీద పర్సనల్‌ ఎటాక్‌ చేసినందుకు గానూ క్రిమినల్‌ కేసులు పెట్టడంతో పాటు రూ.పది కోట్లు పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.

                                           

About Author