రైతు భరోసాలలో సామాజిక తనిఖీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని 9 రైతు భరోసా కేంద్రాలలో రబీ 2023- 2024 సంవత్సరంకుగాను సామాజిక తనిఖీ రైతు గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి కె శ్రీదేవి అన్నారు, శనివారం చెన్నూరు-3, గుర్రంపాడు, చిన్నమాచుపల్లి రైతు భరోసా కేంద్రాలలో రైతు లకు సంబంధించి గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె ఈ- క్రాఫ్ చేసుకున్న రైతుల వివరాలు వీడియో రికార్డింగ్, తీయడం జరిగింది, అలాగే రైతుల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి ఈనెల 5వ తేదీ లోపు ఆ సమస్యలని పరిష్కరించడం జరుగుతుందని ఆమె తెలిపారు, అంతేకాకుండా రైతులకు సంబంధించిన సమస్యలపై చిన్న మార్పులు చేసి 8వ తేదీన తుది జాబితాను ప్రదర్శించడం జరుగుతుందన్నారు, అదేవిధంగా అన్ని రైతు భరోసా కేంద్రాలలో సోమవారం గ్రామసభ ఏర్పాటుచేసి రైతులకు చేసినవి, చేస్తున్న పనులతో పాటు రైతు సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించబడతాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సి ఇందిర, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డి చరణ్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.