సోషల్ మీడియా జనాల్ని చంపేస్తోంది : బైడెన్
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోన పై తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వార సామాజిక మాధ్యమాలు జనాల్ని చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ పై దుష్ప్రచారం చేస్తున్న ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు మీరేమైన సందేశం ఇస్తారా ? అన్న విలేకరుల వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. వారు ప్రజల్ని చంపేస్తున్నారు. టీకాలు వేసుకోకపోవడమే ఇప్పుడు పెద్ద వ్యాధి
అని అన్నారు. ఈ వాదనను ఫేస్ బుక్ అధికార ప్రతినిధి డానీ లీవర్ అంగీకరించలేదు. ఫేస్ బుక్ లో కరోన పై వచ్చిన అధికారిక సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారని తెలిపారు. ఒక్క అమెరికాలోనే వ్యాక్సిన్ కేంద్రాల వివరాలను 30 లక్షల మంది పరిశీలించారని తెలిపారు. ఈ గణాంకాలు ఫేస్ బుక్ ప్రజల ప్రాణాల్ని కాపాడుతోందన్న విషయాన్ని తెలియజేస్తాయని చెప్పారు.