సోసైటీ బ్యాంకు అధికారులు రైతులనుంచి బలవంతపు వసూళ్లు
1 min read
రైతుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్న సోసైటీ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి..
రుణాలు చెల్లించడానికి కనీసం గడువు ఇవ్వండి..
లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోలన కార్యక్రమాలు చేపడతాం..
ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ డిమాండ్..
ఆలూరు , న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని పలు సోసైటీ బ్యాంకు అధికారులు రైతులనుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారని వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆలూరు తహసీల్దార్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సోసైటీ బ్యాంకు ద్వారా రైతులకు కర్షక జ్యోతి స్కీం కింద రైతులు రుణాలు తీసుకున్నారని రుణాలు చెల్లించడానికి కనీసం గడువు కూడా ఇవ్వకుండా సోసైటీ అధికారులు రైతులనుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారని, వర్షాలు సరిగారాక, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులలో ఉంటే బెల్డోణ సొసైటీ అధికారులు గ్రామాలలో తిరుగుతూ ట్రాక్టర్లు, బైకులు, తీసికెళ్ళి ఆస్తులను జప్తు చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు దూకుడు తగ్గించుకోని రైతులకు గడువు ఇవ్వాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోలన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.మాదిగల చిరుకాల కోరిక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలుకై సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని అత్యంత వేగంగా ఎస్సీ వర్గీకరణ అమలుచేసే దిశగా అడుగులు వేసింది కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ ఘనత దక్కుతుందని, కానీ కోందరు నాయకులకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పేరు కూడా గుర్తుకు రాలేకపోవడం శోచనీయమన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలూరు మండల అధ్యక్షులు మొలగవెల్లి రామాంజనేయులు, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్ ఉపాధ్యక్షులు కరెంటు గోవిందు, సీనియర్ నాయకులు తుంబలబీడు లక్ష్మన్న, లింగంపల్లి రామాంజనేయులు, మీసాల గోవిందు, వరకుమార్, తిమ్మప్ప, నవీన్, వెంకటేష్, బాలకృష్ణ మరియు వీరాంజనేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
