రిలయన్స్ చేతికి `సోడియమ్ అయాన్` బ్యాటరీ సంస్థ
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ బ్రిటన్ కు చెందిన ఫారాడియాన్ సంస్థను వెయ్యికోట్లకు కొనుగోలు చేసింది. ఫారాడియాన్ సోడియమ్ అయాన్ బ్యాటరీలను తయారు చేస్తుంది. ఈ కొనుగోలు బ్యాటరీల టెక్నాలజీ పరంగా ఇండియాను ముందు వరుసలో ఉంచేందుకు ఉపయోగపడుతుందని ముఖేశ్ అంబాని తెలిపారు. సోడియమ్ అయాన్ బ్యాటరీలు సురక్షితమే కాకుండా.. అధిక విద్యుత్ సాంద్రత కలిగి ఉంటాయని, వ్యయం కూడ తక్కువేనని తెలిపారు. లిథియమ్ అయాన్, లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోలిస్తే సోడియమ్ అయాన్ బ్యాటరీల వల్ల ఎక్కువ ఉపయోగం ఉందని అన్నారు.