NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పై నైజీరియ‌న్ల అత్యాచారం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బెంగ‌ళూరులో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. ఏపీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పై అత్యాచారం జ‌రిగింది. అత్యాచారం ఆరోప‌ణ‌ల పై ఇద్దరు నైజీరియ‌న్లను బాణ‌స‌వాడి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివ‌రాలు పోలీసులు బ‌య‌ట‌పెట్టలేదు. ఆమె పై అత్యాచారం జ‌రిగిన‌ట్టు రెండు రోజుల కింద‌ట ఫిర్యాదు అందిన‌ట్టు, ఆ కేసులో అబుజి ఉబ‌కా, టోనీల‌ను నిందితులుగా గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు. త‌న పై అత్యాచారం జ‌రిగింద‌ని బాధిత యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ద‌ర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నైజీరియా రాయ‌బార కార్యాల‌యానికి స‌మాచారం ఇచ్చామ‌ని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య ప‌రీక్షల నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు.

About Author