PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూసార పరీక్షల వల్ల అధికమేలు

1 min read

– కెవికె శాస్త్రవేత్త డాక్టర్ టి స్వామి చైతన్య
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతులు భూసార పరీక్ష లు చేయించుకోవడం ద్వారా అధికమేలు కలుగుతుందని కె వి కె శాస్త్రవేత్త డాక్టర్ టి స్వామి చైతన్య అన్నారు, గురువారం స్థానిక రైతుభరోసా కేంద్రం చెన్నూరు- 2 లో భూసార పరీక్ష నేల ఆరోగ్య పరిస్థితి పై మండల స్థాయి లో అగ్రికల్చర్ సిబ్బందికి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్త డాక్టర్ టి స్వామి చైతన్య మాట్లాడుతూ, మట్టి నమూనా తీయు విధానం గురించి తెలియజేశారు, అలాగే ఎకరానికి 8 చోట్ల మట్టి నమూనా సేకరించాలని వరి మొదలగు పంటలకు 15 సెంటీమీటర్లు లోతు వరకు, అదేవిధంగా పత్తి వంటి వాణిజ్య పంటలకు 30 సెంటీమీటర్లు లోతు వరకు ,పండ్ల తోటలకు ఒకటి లేదా రెండు మీటర్ల లోతు వరకు మట్టి నమూనా సేకరించి పరీక్షకు పంపించాలని సూచించారు , అంతేకాకుండా నీటి పరీక్షకు బోరు నుంచి నీటిని సేకరించి అదే రోజు పరీక్షకు లాబరేటరీకి పంపించాలని తెలియజేశారు, రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులు వలన భూమికి కలిగే ఉపయోగాలను తెలియజేశారు, పి పద్మజ ఏవో ఎఫ్ టి సి రైతుశిక్షణ కేంద్రం మాట్లాడుతూ ,చౌడు నెలలను గుర్తించు విధానము జిప్సంతో చౌడును తగ్గించే విధానం గూర్చి తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ అధికారి కె శ్రీదేవి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం వారీగా టార్గెట్ ప్రకారం మట్టి నమూనాను సేకరించడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని రైతుభరోసా కేంద్రాల ఇన్చార్జులు పాల్గొనడం జరిగినది.

About Author